‘గబ్బర్ సింగ్’ ఫీవర్… పొటెత్తిన అభిమానులు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్ సింగ్ ఫీవర్ రాష్ట్ర వాప్తంగా మొదలైంది. మే 11న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజునుంచే అడ్వాన్స్డ్ బుకింగ్ ఓపెన్ చేశారు. దీంతో టిక్కెట్లు దక్కించుకోవడానికి అభిమానులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు.
గబ్బర్ సింగ్ చిత్రం విడుదల కాబోతోన్న ఏ థియేటర్ చూసినా జనాలతో కిక్కిరిసి ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే రేపటి వరకు వీకెండ్(శుక్ర, శని, ఆది) టిక్కెట్స్ అన్నీ అమ్ముడు పోవడం ఖాయంగా కనిపిస్తోందని థియేటర్ల యజమానులు అంటున్నారు. తీరిగ్గా షోకు గంట ముందు టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తే మాత్రం నిరాశ తప్పదు. ఇక బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ. 2 వేల వరకు పలుకుతోంది. గబ్బర్ సింగ్ సినిమా కన్సెప్టు విషయానికొస్తే…… అతను ఖాకీ కడితేనే పోలీసు. నెత్తి మీద టోపీ ఉన్నంతసేపూ సెక్షన్ల గురించి, చట్టాల గురించి పట్టించుకుంటాడు. లాఠీ పక్కనపెడితే అతనికంటే పెద్ద రౌడీ ఉండడు. కేడీగాళ్లను దారిలోకి తీసుకురావాలంటే… ఈ పద్ధతే సరైనదని అతని నమ్మకం. ఓవరాల్‌గా ఇది ఓ కిలాడీ పోలీస్ స్టోరీ.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

0 comments:
Post a Comment